Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

Mahabubnagar : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా రవికుమార్.. అభినందించిన ఎమ్మెల్యే..!

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మహబూబ్‌నగర్ జిల్లా శాఖ నూతన చైర్మన్‌గా కేఎస్ రవికుమార్, వైస్ చైర్మన్ గా రామకృష్ణయ్య, కోశాధికారిగా జి.రమణయ్య, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Mahabubnagar : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా రవికుమార్.. అభినందించిన ఎమ్మెల్యే..!

మహబూబ్‌నగర్ టౌన్, మన సాక్షి :

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మహబూబ్‌నగర్ జిల్లా శాఖ నూతన
చైర్మన్‌గా కేఎస్ రవికుమార్, వైస్ చైర్మన్ గా రామకృష్ణయ్య, కోశాధికారిగా జి.రమణయ్య, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నూతన చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి తో పాటు సభ్యులు బాబు చింతలపల్లి (సి. బాబుల్ రెడ్డి), బొండిగ విష్ణు జనార్దన్ , చిగుళ్లపల్లి, లక్ష్మీనారాయణ, దేవిక బాదిమి, ధర్మరాజు ఎస్, జి. శామ్యూల్, జక్కని తిరుపతి రెడ్డి, మగంతల జయ రాములు, పుట్టపాగ రఘుపతి, రవి కుమార్ యాదవ్ వై., సురభి జగపతి రావు, వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్యే వారికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంతర్జాతీయ సేవా సంస్థ అయిన రెడ్‌క్రాస్ ద్వారా జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు బాధితులకు తక్షణమే అండగా నిలవాలని సూచించారు.

సమాజంలో ప్రాణదాతలుగా నిలిచే రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య సేవలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను గ్రామీణ స్థాయి వరకు మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు