Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

చలో విజయవాడ కు వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులకు అనుమతి లేదు..!

అన్నమయ్య జిల్లా అకాల వర్షాలు, వరదల కారణంగా ఆదివారం నిర్వహించనున్న "చలో విజయవాడ" కార్యక్రమానికి వెళ్లేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పష్టం చేశారు.

చలో విజయవాడ కు వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులకు అనుమతి లేదు..!

మదనపల్లె, మనసాక్షి

అన్నమయ్య జిల్లా అకాల వర్షాలు, వరదల కారణంగా ఆదివారం నిర్వహించనున్న “చలో విజయవాడ” కార్యక్రమానికి వెళ్లేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పష్టం చేశారు. ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. అనుమతి లేని సామూహిక కార్యక్రమాలు, ర్యాలీలు లేదా ధర్నాలకు ఉద్యోగులు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా ఈ కార్యక్రమానికి వెళితే వారిపై నిబంధనల మేరకు చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు