విద్యార్థులపై ప్రైవేటు టీచర్ దాస్టికం..?
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ కర్కశంగా ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.

విద్యార్థులపై ప్రైవేటు టీచర్ దాస్టికం..?
గోదావరిఖని, మన సాక్షి :
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ కర్కశంగా ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. సదరు ఉపాధ్యాయునిపై పలుమార్లు పాఠశాల పై అధికారికి చెప్పినా కూడా తీరు మారడం లేదు. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ప్రవర్తనపై విమర్శలు వినిపిస్తున్నాయి.
హై స్కూల్ విద్యార్థుల పట్ల ఏదో ఒక కారణం చేత విద్యార్థులను చితకబాదుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఓ విద్యార్థిని చితకబాదడం తో తల్లిదండ్రులు వచ్చి గొడవ చేసినట్లు సమాచారం. పాఠశాలలో జరిగే విషయాలు ఎవరికి చెప్పవద్దని విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నట్లు విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read : District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్..!
విద్యార్థి సంఘాలు, నాయకులను కించపరిచిగే విధంగా ఉపాధ్యాయుడు పాఠశాలలో వ్యవహరిస్తున్న తీరు పట్ల ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు పాఠశాల ప్రిన్సిపాల్ ను డిమాండ్ చేశారు. గతంలో కూడా విద్యార్థులపై అకారణంగా చేయి చేసుకోవడంపై పద్ధతి మార్చుకోవాలని మందలించిన ఆ టీచర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదని నాయకులు ఆరోపిస్తున్నారు.
అయినా కూడా టీచర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళన చేపడుతామని తెలిపారు. సదరు ఉపాధ్యాయునిపై గతంలో పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.









