Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
విధి నిర్వహణలో ఉన్న సిఐ గుండెపోటుతో మృతి..!
విధి నిర్వహణలో ఉన్న సిఐ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలోని అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద విధులలో సీఐ అహ్మద్ అలీ ఉన్నారు.

విధి నిర్వహణలో ఉన్న సిఐ గుండెపోటుతో మృతి..!
మన సాక్షి, విజయవాడ :
విధి నిర్వహణలో ఉన్న సిఐ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలోని అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద విధులలో సీఐ అహ్మద్ అలీ ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఉన్న సిఐ అహ్మద్ అలీ కి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన తోటి పోలీసులు సిపిఆర్ చేసి హుటాహుటిన దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.









