ప్రణయ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే.. 5కె రన్ విజయవంతం..!
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో "స్వచ్ఛతా హి సేవ", ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మంగళవారం డాక్టర్ శామ్యూల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K రన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా, ఘనంగా జరిగింది.

ప్రణయ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే.. 5కె రన్ విజయవంతం..!
ప్రారంభించిన మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్, డాక్టర్ శామ్యూల్, డాక్టర్ ప్రణయ్
మహబూబ్ నగర్ టౌన్, మన సాక్షి:
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో “స్వచ్ఛతా హి సేవ”, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మంగళవారం డాక్టర్ శామ్యూల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K రన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా, ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ముదిరాజ్ విచ్చేసి, జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ రోజూ శారీరక వ్యాయామం చేస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అలాగే పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలాన్నారు.
స్వచ్ఛ మహబూబ్‌నగర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శామ్యూల్, డాక్టర్ ప్రణయ్ ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది, యువత, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.










