Breaking Newsక్రైంజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లాలో దారుణం.. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య
భర్తను రోకలి బండతో భార్య కొట్టి చంపింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

మంచిర్యాల జిల్లాలో దారుణం.. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య
మన సాక్షి, వెబ్ డెస్క్ :
భర్తను రోకలి బండతో భార్య కొట్టి చంపింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా అశోక్ రోడ్ లో నివాసం ఉంటున్న మోహన్ (45) యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్నారు. మోహన్ భార్య జమునను అనుమానంతో వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. దాంతో భార్య.. భర్తను రోకలిబండతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









