Miryalaguda : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వృద్ధ తల్లిదండ్రులకు దక్కిన న్యాయం..!
వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరిగింది. తన కుమారుడి పేర రాసి ఇచ్చిన ఇల్లు నిరుపయోగంగా ఉన్న కూడా తమను ఉండనివ్వడం లేదని, తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ వృధా తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్లు ఆశ్రయించారు. దాంతో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెంటనే స్పందించి వృద్ధులకు ఆ ఇంటిలో ఉండేవిధంగా ఉత్తర్వులు జారీచేశారు.

Miryalaguda : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వృద్ధ తల్లిదండ్రులకు దక్కిన న్యాయం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరిగింది. తన కుమారుడి పేర రాసి ఇచ్చిన ఇల్లు నిరుపయోగంగా ఉన్న కూడా తమను ఉండనివ్వడం లేదని, తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ వృధా తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్లు ఆశ్రయించారు. దాంతో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెంటనే స్పందించి వృద్ధులకు ఆ ఇంటిలో ఉండేవిధంగా ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం ఆర్డిఓ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆ వృద్ధ తల్లిదండ్రులను ఇంటిలో చేర్చారు. వివరాల ప్రకారం..
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సింగం యాదమ్మ భర్త అంజయ్య రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ చైతన్య నగర్ మిర్యాలగూడ పట్టణం (65) వయోవృద్ధులు. వీరికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు చనిపోయారు. ఒక కుమార్తె. వీరికి విద్యాభ్యాసం పెళ్లిళ్లు బాధ్యతలు అన్ని నిర్వర్తించడం జరిగింది. వీరికి వ్యవసాయ భూమి పెద్ద దేవులపల్లి త్రిపురారం మండలంలో కలదు.
Also Read : రెండు రోజుల క్రితం ఓయోలో దిగిన జంట.. రక్తపు మడుగులో యువతి.. పరారీలో యువకుడు..!
వీరికి ఒక నివాసము మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ రోడ్ నెంబర్ 7 నందు ఇళ్ళు కలదు. ఇట్టి ఇంటి ని గత పది 12 ఏళ్లుగా నివసిస్తూ కుమారుడికి పట్టా చేయడంతో గతనెల ఆర్టీవో ట్రిబ్యునల్ నందు సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2007 ప్రకారం బ్రతికున్నంత కాలం ఆ ఇంటిలో నివసించడానికి కేవలం ఉండడానికి మాత్రమే ఆశ్రయం ఇవ్వాలని కోరడం జరిగింది.
అ ఇంటి లో కుమారుడు రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కొట్టడం, తిట్టడం వారికి భౌతికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత నెల ప్రజావాణికి రావడంతో జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్.. ఆర్డిఓ కి కేసు పైన విచారణ జరిపి త్వరితగతిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరారు. దాంతో ఆర్డీవో కే రమణారెడ్డి గత నెల విచారణ నిర్వహించి తల్లిదండ్రులను రానివ్వకుండా ఇబ్బంది చేస్తున్నారని, తల్లిదండ్రులు వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని, మేము మా కుమారుడికి పట్టా చేసిన ఇంటి నందుఉండడానికి ఆశ్రయము. కల్పించాలని కోరారు.
Also Read : కళ్ల ఎదుటే కారు దగ్ధం.. తండ్రి సజీవ దహనం, కొడుకుని కాపాడిన స్థానికులు..!
ఇంటి నందు కుమారుడు కూడా ఉండడం లేదని మమ్మల్ని ఉండనివ్వకుండా ఖాళీగా ఉంచుతున్నాడని అది నిరుపయోగం గా ఉన్నదని, పనికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20 వ తేదీన ఇట్టి ఉత్తర్వులను అమలు పరచవలసిందిగా స్థానిక ఆర్డిఓ ఎస్ రమణారెడ్డి ని కోరారు.
ఉత్తర్వుల అమలులో భాగంగా స్థానిక సీఐ నాగభూషణం, సీడీపీఓ వేణు, రెవిన్యూ శాఖ మరియు మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ అందరు కలిసి ఆ వయోవృద్ధులని వారి ఇంటిలో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రాజు రాజశేఖరరెడ్డి మున్సిపల్ సిబ్బంది సాజిద్ సాంబయ్య రెవిన్యూ శాఖ నుండి రాజుగారు నాగిరెడ్డి నవీన్ సునీల్ అంగన్వాడి టీచర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.










