Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
మియాపూర్ లో పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
పీజీ వైద్య విద్యార్థిని కొమటి సృజన (27) శుక్రవారం మియాపూర్‌లోని ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

మియాపూర్ లో పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
శేరిలింగంపల్లి, మన సాక్షి
పీజీ వైద్య విద్యార్థిని కొమటి సృజన (27) శుక్రవారం మియాపూర్‌లోని ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హనుమకొండలోని ఓ వైద్య కళాశాలలో పీడియాట్రిక్స్ విభాగంలో మొదటి సంవత్సరం పీజీ చదువుతున్న ఆమె సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం కనిపించకుండా పోయారు.ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు మియాపూర్‌లోని హోటల్ గ్రాండ్ బ్రోచిల్‌లో 502వ గదిని గుర్తించారు.
స్పేర్ కీతో గది తలుపు తెరిచి చూడగా మంచంపై ఆమె మృతదేహం కనిపించింది.సృజన తండ్రి కె. భూమయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రవికుమార్ అనే వ్యక్తి గతంలో ఆమె బంగారు గొలుసు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాతే ఆమె హైదరాబాద్‌కు వచ్చినట్లు ఫిర్యాదులో వివరించారు. ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









