Breaking Newsక్రైంజిల్లా వార్తలు
మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం.. గొంతులో బిస్కెట్ ఇరుక్కొని చిన్నారి మృతి..!
మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండలం సుర్తి తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొంతులో బిస్కెట్ ఇరుక్కొని ఏడాది చిన్నారి మృతి చెందాడు.

మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం.. గొంతులో బిస్కెట్ ఇరుక్కొని చిన్నారి మృతి..!
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి, మన సాక్షి :
మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ మండలం సుర్తి తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొంతులో బిస్కెట్ ఇరుక్కొని ఏడాది చిన్నారి మృతి చెందాడు. తండాకు చెందిన మూడవత్ శ్రీను, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు. ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటుండగా బిస్కెట్లు ఇచ్చి వంట చేసేందుకు ఇంట్లోకి తల్లి మౌనిక వెళ్ళింది. కాగా ఒక చిన్నారి బిస్కెట్ తినగా గొంతులో చిక్కుకొని ఊపిరాడక ఇబ్బంది పడి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఏడాది చిన్నారి మృతి చెందడంతో కుటుంబంతో పాటు తండాలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.









