అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి..!
అమెరికాలోని హైవే 61 డ్రిటిచ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ మృతి చెందింది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
అమెరికాలోని హైవే 61 డ్రిటిచ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ మృతి చెందింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ (29) మృతి చెందారు. మరిపెడ మండలం దారం శ్రీను, జ్యోతిల పెద్ద కుమార్తె సుప్రియ. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రంజిత్ తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.
Also Read : మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం.. గొంతులో బిస్కెట్ ఇరుక్కొని చిన్నారి మృతి..!
భర్త అమెరికాలోని మీసోరి నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా భర్త తో పాటు ఆమె కూడా అమెరికాలోనే ఉంటుంది. ఆ దంపతులకు రెండున్నర ఏళ్ల కుమారుడు ఉన్నారు. అయితే సుప్రియ మరో ఎన్ఆర్ఐ మిత్రురాలితో కలిసి రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున రెస్టారెంట్ పని ముగించుకుని ఇద్దరు కారులో ఇంటికి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్ వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతిచెందగా మరో స్నేహితురాలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.









