Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

మహబూబ్ నగర్ లో విషాదం.. దంపతుల ఆత్మహత్య..!

మహబూబ్‌నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మహబూబ్ నగర్ లో విషాదం.. దంపతుల ఆత్మహత్య..!

మహబూబ్ నగర్ టౌన్, మన సాక్షి:

మహబూబ్‌నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని ప్రేమనగర్‌కు చెందిన కాట్రవల్లి శ్రీనివాసులు (59), ఆయన భార్య కాట్రవల్లి జ్యోతి, ( 52) ప్రేమనగర్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తూ, అదేవిధంగా చిట్టీల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.

ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం, చిట్టీల వ్యవహారంలో కొంతమంది సభ్యులు చిట్టీ డబ్బులు తీసుకున్న అనంతరం తిరిగి చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం. చిట్టీ డబ్బుల విషయంలో కొంతమంది బంధువులు, పరిచయస్తులు ఇంటికి వచ్చి డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో శ్రీనివాసులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.

ఈ క్రమంలో ఆయన అప్పులు కూడా చేసినట్లు గతంలో కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. ఈరోజు ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో, శ్రీనివాసులు మరియు ఆయన భార్య జ్యోతి ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందినట్లు సమాచారం అందింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిట్టీల వ్యవహారం, ఆర్థిక లావాదేవీలు మరియు ఇతర కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఇజాజుద్దీన్ మాట్లాడుతూ, చిట్టీల వ్యాపారం నిర్వహించే ఏజెంట్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. అవసరమైతే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి, పోలీసుల సలహాలు, సూచనలు తీసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా, చిట్టీలు వేసిన వారు కూడా తమ డబ్బుల విషయంలో సంబంధిత వ్యక్తులపై అనవసరమైన ఒత్తిడి, వేధింపులకు పాల్పడకుండా, ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరమైన మార్గాలను అనుసరించాలని ఇన్‌స్పెక్టర్ ఇజాజుద్దీన్ సూచించారు. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు పరస్పరం చర్చించుకుని, చట్టపరమైన పరిష్కార మార్గాలను ఆశ్రయించాలని తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు