BREAKING NEWS : బంగారం వ్యాపారి అదృశ్యం, పాఠశాల బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి.. ఓకే క్లిక్ తో మనసాక్షి బ్రేకింగ్ న్యూస్..!
బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తున్న మన సాక్షి మీకోసం ఈరోజు తాజా వార్తలు...

BREAKING NEWS : బంగారం వ్యాపారి అదృశ్యం, పాఠశాల బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి.. ఓకే క్లిక్ తో మనసాక్షి బ్రేకింగ్ న్యూస్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తున్న మన సాక్షి మీకోసం ఈరోజు (07-10-2026 )తాజా వార్తలు…
బంగారం వ్యాపారి అదృశ్యం :
చిక్కడపల్లి పరిధిలో బంగారం వ్యాపారి అదృశ్యం. నిన్నటి నుంచి షాప్ కు వెళ్లి అదృశ్యమైన బంగారం వ్యాపారి. రామంతపూర్ లో నగల దుకాణం నిర్వహిస్తున్న ఆ వ్యాపారి శ్రీనివాసరావు. నిన్న ఉదయం నుంచి షాప్ కు వెళ్లి తిరిగి రాలేదు. దాంతో శ్రీనివాసరావు బంధువు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
నేడు ఢిల్లీ వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి :
నేడు ఢిల్లీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఢిల్లీలో నిన్నటి పరిణామాలపై పార్టీ అగ్ర నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత :
శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 2.25 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్నారు.
హుస్నాబాద్ లో కాంగ్రెస్ భారీ నిరసన :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాహుల్, ప్రియాంక, ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు కు నిరసనగా ధర్నా చేపట్టారు. ఆందోళనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి :
రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ పరిధిలో ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందారు. బైకును ఢీకొట్టిన వాహనం వ్యక్తి మృతి చెందారు. మృతుడు విశ్రాంత ఆర్టిసి డ్రైవర్ కృష్ణగా గుర్తించారు.
మూడేళ్ల బాలుడి పై నుంచి వెళ్ళిన ప్రైవేట్ పాఠశాల బస్సు :
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పిట్ట కాలు బోడు తండాలో విషాద పరిస్థితి నెలకొన్నది. మూడేళ్ల బాలుడిపై నుంచి వెళ్లిన ప్రైవేటు పాఠశాల బస్సు. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుగా వినిపిస్తున్నారు.
నిజామాబాద్ లో బీసీ కమిషన్ పర్యటన :
బుధవారం నిజాంబాద్ జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన చెప్పట్టనుంది. గ్రామ బహిష్కరణ ఘటనలపై విచారణ చేపట్టనున్న కమిషన్. కలెక్టరేట్ లో బాధితుల ఫిర్యాదులు స్వీకరించనున్న బీసీ కమిషన్. బాధితులతో ముఖాముఖి నిర్వహించనున్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్.









