కూతురుని కాపురానికి పంపకపోతే.. మనవరాలు నగ్న ఫోటోలు వైరల్ చేస్తా..!
నీ కూతురును కాపురానికి పంపకపోతే.. మీ మనవరాలు నగ్న ఫోటోలను వైరల్ చేస్తానని ఓ అల్లుడు అత్తను బెదిరించాడు. దాంతో పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కూతురుని కాపురానికి పంపకపోతే.. మనవరాలు నగ్న ఫోటోలు వైరల్ చేస్తా..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
నీ కూతురును కాపురానికి పంపకపోతే.. మీ మనవరాలు నగ్న ఫోటోలను వైరల్ చేస్తానని ఓ అల్లుడు అత్తను బెదిరించాడు. దాంతో పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని కొత్తపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కొత్తపల్లికి చెందిన ఈశ్వర్ రెడ్డి (35) మొదటి భార్యతో విడిపోయి.. చదువుకునే రోజుల్లోనే పరిచయం ఉన్న కిన్నెర అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కిన్నెర అనే మహిళ కూడా మొదటి భర్తతో విడిపోయి తన 17 సంవత్సరాల కూతురితో ఈశ్వర్ రెడ్డి వద్దకు వచ్చింది. గత ఏడాది జనవరిలో కూతురి వరుసైన ఆ బాలికపై ఈశ్వర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడగా ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపారు.
Also Read : Black Coffee : బ్లాక్ కాఫీ వల్ల ఎన్ని ప్రయోజనలో.. ఎలా చేయాలి, ఎప్పుడు తాగాలో తెలుసుకుందాం..!
అయితే బెయిల్ పై బయటికి వచ్చిన ఈశ్వర్ రెడ్డి కిన్నరను కాపురానికి రమ్మని పిలిచాడు. దాంతో ఆమె నిరాకరించింది. అందుకు ఆమె తల్లి కమలమ్మ కారణమని భావించి ఆమెపై సీసాతో దాడి చేసి తల పగలగొట్టాడు. కాగా ఆసుపత్రి నుండి ఇటీవల కమలమ్మ ఇంటికి వచ్చింది. అయినా కూడా ఈశ్వర్ రెడ్డి మళ్ళీ గొడవ పెట్టుకోగా వేధింపులు భరించలేక తన కూతురు కిన్నెరను ఇతర దేశానికి పంపింది.
ఈ క్రమంలోనే నీ కూతురిని పిలిపించి తనతో కాపురాని పంపకపోతే నీ మనవరాలు నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని ఈశ్వర్ రెడ్డి అత్తను బెదిరించాడు. దాంతో కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఈశ్వర్ రెడ్డి ని అరెస్టు చేశారు.









