Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని బాలుడు

మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో సుమారు 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని బాలుడు కనిపించినట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజుద్దీన్ తెలిపారు. 

మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని బాలుడు

మహబూబ్ నగర్ టౌన్, మన సాక్షి:

మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో సుమారు 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని బాలుడు కనిపించినట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజుద్దీన్ తెలిపారు.

సదరు బాలుడి పేరు అడగగా మహేందర్ మహేష్ అని చెప్పినాడు, బాలుడి తల్లిదండ్రుల వివరాలు మరియు ఇతర వ్యక్తిగత వివరాలు తెలియరాలేదని, బాలుడు టీ షర్ట్, షార్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు.

బాలుడి తల్లిదండ్రులు లేదా బంధువులు ఎవరైనా తప్పిపోయిన బాలుడి కోసం వెతుకుతున్నట్లయితే, టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి వివరాలు అందించాలని ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్ కోరారు.

అలాగే బాలుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.2 టూ టౌన్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ టౌన్ 8712665202, ఇన్స్పెక్టర్ :8712659312, సబ్ ఇన్స్పెక్టర్ 8712659334, 8712659335

మరిన్ని వార్తలు