నేడు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభం.. ఏ రోజు ఎలా కొలుస్తారో తెలుసుకుందాం..!
తెలంగాణ లో ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలను ప్రారంభించి తొమ్మిది రోజులపాటు వివిధ పేర్లతో బతుకమ్మ పాటలతో సాయంత్రం బతుకమ్మ ఘాటుల వద్ద మారుమోగుతుంటాయి.

నేడు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభం.. ఏ రోజు ఎలా కొలుస్తారో తెలుసుకుందాం..!
మన సాక్షి (సుభాష్ – తుంగతుర్తి )
తెలంగాణ లో ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలను ప్రారంభించి తొమ్మిది రోజులపాటు వివిధ పేర్లతో బతుకమ్మ పాటలతో సాయంత్రం బతుకమ్మ ఘాటుల వద్ద మారుమోగుతుంటాయి. రకరకాల పూలతో మన సాంప్రదాయం ప్రకారం మహిళలు పట్టుచీరలతో లంగా ఓణీలతో రకరకాల దుస్తులతో మన బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు.
జానపద పాటలతో పల్లెలు పట్టణాల్లో పండుగ శోభ సంతరించుకోవడం ప్రకృతి ఆరాధనకు సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపమైన బతుకమ్మ ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కారున్నాయి.
- ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు ఘనంగా జరుపు కుంటారు.
- ఆ తర్వాత రెండో రోజు అటుకుల బతుకమ్మ ఈరోజు సబ్సిడీ పప్పు బెల్లం అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు.
- మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు ముద్దపప్పు బెల్లం పాలతో నైవేద్యం తయారుచేస్తారు.
- నాలుగో రోజు బతుకమ్మను నాన్న బియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. నానబెట్టిన బియ్యం బెల్లం పాలతో నైవేద్యం సమర్పిస్తారు.
- ఐదో రోజు అట్లా బతుకమ్మ అని పిలుస్తారు. గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో చేసిన అట్లను నైవేద్యంగా పెడతారు.
- ఆరో రోజు అలిగిన బతుకమ్మగా కొలుస్తారు. ఈరోజు నా ఎవరు కూడా బతుకమ్మ ఆడరు ఎలాంటి నైవేద్యం పెట్టరు.
- ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు బియ్యం పిండిని వేపకాయల తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.
- ఎనిమిదో రోజు వెన్న ముద్ద బతుకమ్మగా పిలుస్తారు. ఈరోజు నువ్వులు వెన్న ముద్ద బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు.
- తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ కొన్ని చోట్ల పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఈరోజు తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ పేర్లు పేర్చుతూ పెరుగన్నం పులిహోర తదితర నైవేద్యాలతో సమర్పిస్తారు.
ఇలా తొమ్మిది రోజులపాటు మన తెలంగాణ సాంప్రదాయం ఆడపడుచులు బతుకమ్మ పండుగను గత వంద సంవత్సరాల నుండి మన తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం పాఠశాలలు కాలేజీలను సెలవు దినంగా ప్రకటించారు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ తర్వాత దసరా తర్వాత పాఠశాల కాలేజీలు తెలుసుకోవడం జరుగుతుంది.
ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంతో ఆటపాటలతో ఒక్కొక్క వేసి చందమామ అంటూ పాటలు పాడుతూ డాన్సులు కోలాటాలు రకరకాల నృత్యాలతో బతుకమ్మ పండుగను మన ఆడపడుచులు ప్రతి సంవత్సరం ఆడుతున్నారు అని చెప్పవచ్చు.









