చీప్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన
ఎస్.ఐ.ఆర్ ను రద్దు చేయాలని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) సూర్యాపేట జిల్లా కార్యవర్గ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.

చీప్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన
సూర్యాపేట, మనసాక్షి
ఎస్.ఐ.ఆర్ ను రద్దు చేయాలని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) సూర్యాపేట జిల్లా కార్యవర్గ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మాట్లాడుతూ…భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది. మూడో విడత సిర్ ముసాయిదా ఓటరు జాబితాలు విడుదలయ్యే నాటికి దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ప్రజల పేర్లు ఓటరు జాబితాల నుంచి తొలగించబడ్డట్లు తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 73 లక్షల 39 వేల ఓట్లను తొలగించినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయని .బిజెపి హేతర రాష్ట్రాలలో ఓట్లను తొలగించడం జరుగుతుందని అన్నారు.
తొలగించిన ఓట్లకు బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా గత నెల రోజులుగా విద్యార్థి,యువత రోడ్లపై కొచ్చి ఉద్యమాలు నిర్వహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. ఈరోజు అనగా అక్టోబర్ 10 వ తారీఖున ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి సిద్ధమైన ఉద్యమకారులను అణిచివేయడం కోసం దేశ నగరమైన ఢిల్లీలో ఉన్న సుమారు 45 మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేస్తూ నిత్యవసర రవాణాలను కూడా నిలిపివేసి ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మరోసారి దేశానికి తెలియజేస్తున్నారు.
ALSO READ : నేడు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభం.. ఏ రోజు ఎలా కొలుస్తారో తెలుసుకుందాం..!
ఇతర రాష్ట్రాల నుండి వచ్చే 237 రైళ్ల రాకపోకలను నిలిపివేయడం అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఓటు హక్కును కాలరాయటమంటే భారత రాజ్యాంగంపై పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం దాడి నిర్వహిస్తుందని మండిపడ్డారు. ఓట్లను కోల్పోయిన జాబితాలో ముఖ్యంగా ఆదివాసులు దళితులు మైనార్టీలు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అన్నారు.
బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న వారి యొక్క ఓట్లనే తొలగించడం అంటే ప్రభుత్వం ఈ వర్గాల ప్రజల ఓటు హక్కును కుట్రపూరితంగా తొలగించిందని అన్నారు. చనిపోయిన వారిని మినహాయించి తొలగించిన ఓట్లన్నీ పునరుద్ధరించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
బిజెపి ప్రభుత్వం బ్రష్టు పట్టిస్తున్న ఎన్నికల విధానాన్ని సంస్కరించాలి, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత ఉండాలి, ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని, ఎస్.ఐ.ఆర్ ను రద్దు చేయాలని, చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో పహారగాస్తున్న పోలీసు బలగాలను తక్షణమే వెనక్కి పంపాలని ఢిల్లీలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని నిరసనకారుల హక్కులకు భంగం కలిగించకుండా నిరసన తెలిపే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు.
ALSO READ : ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి భారీ షాక్.. ఈయు కూటమి విజయభేరి..!
నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి ప్రయోగిస్తే దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. భవిష్యత్తులో బిజెపి పార్టీని గద్దె దించేంతవరకు కూడా విద్యార్థి యువత పోరాడుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి, నాయకులు ప్రవీణ్,వినయ్, మహేష్, నవీన్, రాజు, పవన్, ప్రశాంత్, కిషోర్, భార్గవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.









