నకిరేకల్ లో కలకలం.. కదులుతున్న ఆటోలో నుంచి దూకిన మైనర్ బాలికలు..!
నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఇద్దరు మైనర్ బాలికలు కదులుతున్న ఆటోలో నుంచి దూకిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆటో డ్రైవర్ వేరే మార్గంలో తీసుకెళ్లడంతో భయాందోళనలకు గురై వారు ఆటోలో నుంచి దూకినట్లు సమాచారం.

నకిరేకల్ లో కలకలం.. కదులుతున్న ఆటోలో నుంచి దూకిన మైనర్ బాలికలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఇద్దరు మైనర్ బాలికలు కదులుతున్న ఆటోలో నుంచి దూకిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆటో డ్రైవర్ వేరే మార్గంలో తీసుకెళ్లడంతో భయాందోళనలకు గురై వారు ఆటోలో నుంచి దూకినట్లు సమాచారం. ఊట్కూరు గ్రామానికి వెళ్లేందుకు వారు ఆటో ఎక్కి మధ్యలోనే దూకినట్లు తెలుస్తోంది. ఆటోలో నుంచి కిందికి దూకడంతో గాయాలైన బాలికలు ఆసుపత్రిలో చికిత్స పొందారు.
వివరాల ప్రకారం.. హైదరాబాదు నుంచి ఇద్దరు బాలికలు బస్సులో ప్రయాణించచి తాము దిగాల్సిన ప్రదేశానికి ముందుగానే దిగినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ నుంచి ఊట్కూరు గ్రామానికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. వారిని గమ్యస్థానానికి తీసుకెళ్లాల్సిన ఆటో డ్రైవర్ ఇనుపాముల వైపు తీసుకెళ్లడంతో బాలికలు ఆందోళనకు గురైనట్లు తెలుస్తుంది.
Also Read : ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై కేసు..!
దాంతో పాటు ఆటో డ్రైవర్ ఫోన్లో మరొకరితో మాట్లాడటం మరింత భయపడిన బాలికలు ఆటోలో నుంచి కిందికి దూకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన బాలికలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు.
అనంతరం నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలుస్తోంది. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కానీ మైనర్ బాలికలు ఆటోలో నుంచి దూకిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.









