Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండసూర్యాపేట జిల్లా
రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ కి తీవ్ర గాయాలు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ సతీష్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ కి తీవ్ర గాయాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ సతీష్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. సొంత గ్రామమైన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెం నుంచి విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. నేరేడుచర్ల వద్ద బైక్ అదుపుతప్పి కింద పడటంతో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. 108 వాహనంలో మిర్యాలగూడకు తరలించగా ప్రాథమిక చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.









