Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

మనసాక్షి కి స్పందన.. దివ్యాంగుడి పింఛన్ పునరుద్ధరణకు చర్యలు..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి: మండల తడ్కల్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు మల్లే వీరేశం పింఛన్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయంపై సోమవారం ‘మన సాక్షి’లో " వచ్చే పెన్షన్ ఆగిపోయే .. బతుకు బారమాయే " ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

మనసాక్షి కి స్పందన.. దివ్యాంగుడి పింఛన్ పునరుద్ధరణకు చర్యలు..!

(కంగ్టి – జలీల్, మనసాక్షి )

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు మల్లే వీరేశం పింఛన్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయంపై సోమవారం ‘మన సాక్షి’లో ” వచ్చే పెన్షన్ ఆగిపోయే .. బతుకు బారమాయే ” ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

దివ్యాంగుడి పింఛన్ సమస్యను పరిష్కరించేందుకు మండల అభివృద్ధి అధికారి దయాకర్ రావు చర్యలు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి జ్ఞాన్ దేవ్‌ను వీరేశం ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని, పింఛన్ పునరుద్ధరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.నిలిచిపోయిన పింఛన్ తిరిగి అందేలా జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, రోల్ బ్యాక్ చేసి నిలిచిపోయిన పూర్తి పింఛను వచ్చే విధంగా చూస్తామన్నారు.

సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎంపిడిఓ వెల్లడించారు.పత్రికా కథనానికి స్పందించి దివ్యాంగుడి పింఛన్ సమస్య పరిష్కారానికి అధికారులు ముందుకు రావడంపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు