అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన భార్య
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం లో అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తున్న భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.

అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన భార్య
మహబూబ్ నగర్ జిల్లా, మన సాక్షి
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం లో అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తున్న భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు. మండలంలోని అమ్మాపూర్ కు చెందిన గుత్తి సరితకు 8 ఏళ్ల క్రితం మహేశ్వరం మండలం సుభాన్ పూర్ కు చెందిన గుత్తి వెంకటేష్ తో వివాహమైంది. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు.
కాగా, తమకున్న 3 ఎకరాల భూమిలో తన భర్త ఎకరన్నర భూమిని విక్రయించి జల్సాలు చేసి డబ్బు కాజేశాడు. తీరా మిగిలిన భూమిని విక్రయం చేసేందుకు ప్రయత్నిస్తే తాను అడ్డు చెప్పడంతో తనపై దాడి చేసి గొడవ చేస్తున్నాడు. ఈ విషయంలో తన అత్తకు వివరిస్తే ఆమె కూడా కుమారుడిని సమర్థిస్తోందని, నా భర్త రూ. లక్ష తీసుకొస్తేనే ఇంటికి రావాలంటూ తన తల్లిదండ్రి చెంత వదిలేసి వెళ్లాడని ఆరోపించింది.
అదనపు కట్నం, మానసికంగా వేధిస్తున్నాడని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.









