Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

వేములపల్లిలో ట్రాక్టర్ ఢీకొని యువకుడు దుర్మరణం..!

వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో నార్కట్ పల్లి - అద్దంకి రహదారి మూలమలుపు వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో మాడ్గులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన బుర్రి లోకేష్ (23) దుర్మరణం పొందినట్లు వేములపల్లి ఎస్ఐ సురేష్ రెడ్డి తెలిపారు.

వేములపల్లిలో ట్రాక్టర్ ఢీకొని యువకుడు దుర్మరణం..!

( వేములపల్లి – మౌలాలి )

వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో నార్కట్ పల్లి – అద్దంకి రహదారి మూలమలుపు వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో మాడ్గులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన బుర్రి లోకేష్ (23) దుర్మరణం పొందినట్లు వేములపల్లి ఎస్ఐ సురేష్ రెడ్డి తెలిపారు.

సంఘటన వివరాలు:

స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం మాడ్గులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన బుర్రి లోకేష్ ద్విచక్ర వాహనంపై మాడ్గులపల్లి నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న క్రమంలో వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో నార్కట్ పల్లి – అద్దంకి రహదారి మూలమలుపు వద్ద పాములపాడు వైపు వెళ్లేందుకు పాములపాడు గ్రామానికి చెందిన ట్రాక్టర్ ను నడిపే వ్యక్తి సబ్బు మహేందర్ రెడ్డి అకస్మాత్తుగా వెనక్కి మలుపు తిప్పడంతో ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో లోకేష్ తలకు తీవ్ర గాయాలై రక్తం స్రవించి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతదేహాన్ని వైద్యశాలకు తరలింపు:

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మిర్యాలగూడ ప్రాంత వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ను పోలీసు స్టేషన్ కి తరలించారు. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు