Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం
రేపటితో ముగియనున్న ముగ్గురి ఎమ్మెల్సీల పదవీకాలం.. మూడు ఖాళీలే..!
తెలంగాణలో నవంబర్ 14వ తేదీతో మూడు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్నది. గవర్నర్ కోటాలోని ఈ మూడు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.

రేపటితో ముగియనున్న ముగ్గురి ఎమ్మెల్సీల పదవీకాలం.. మూడు ఖాళీలే..!
మన సాక్షి, హైదరాబాద్
తెలంగాణలో నవంబర్ 14వ తేదీతో మూడు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్నది. గవర్నర్ కోటాలోని ఈ మూడు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. వాటిని భర్తీ చేయాలంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో సమావేశమై మూడు స్థానాలకు గాను ముగ్గురి పేర్లను సూచిస్తూ ఆమోదం కోసం గవర్నర్ కు పంపాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
Also Read : ఏపీ ప్రభుత్వంతో రూ.2,500 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న ఎస్.ఎల్.ఎన్.కాఫీ..
దాంతో నవంబర్ 14వ తేదీతో పూర్తి చేసుకుంటున్న ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గరపు దయానంద్ ఉన్నారు. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉండనున్నాయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కావడంతో వీటి భర్తీకి ఎన్నికల కమిషన్ నిబంధనలు వర్తించవు. ఎప్పుడైనా భర్తీ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది.









