Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

ఏసీబీకి చిక్కిన టోలిచౌకీ పోలీస్ ఇన్‌స్పెక్టర్..!

టోలిచౌకీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీకి చిక్కిన టోలిచౌకీ పోలీస్ ఇన్‌స్పెక్టర్..!

(ఇబ్రహీంపట్నం, మన సాక్షి – శేఖర్)

టోలిచౌకీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఓ హోటల్‌ను అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా నడిపించేందుకు అనుమతించే విషయంలో నెలకు రూ.50 వేల చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. మొదటి నెలకు రూ.10 వేల రాయితీ ఇస్తానని చెప్పినట్లు సమాచారం.

అక్టోబర్ 31న తొలివిడతగా రూ.20 వేలు తీసుకున్న ఇన్‌స్పెక్టర్, బుధవారం మరో రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆయన ఆఫీస్ క్యాబిన్‌లోని బ్యాగులో లంచం సొమ్మును గుర్తించారు.

అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.1 లక్ష,రూ.50 వేలు, రూ.20 వేలు,రూ.15 వేల చొప్పున నాలుగు కవర్లలో ఉన్న లెక్కల్లో చూపని రూ.1.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ నగదు మూలాలపై కూడా ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు