Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
కంగ్టి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సుభాష్ చంద్రగౌడ్
కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపిడివోగా సుభాష్ చంద్రగౌడ్ బాధ్యతలు స్వీకరించారు.

కంగ్టి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సుభాష్ చంద్రగౌడ్
మన సాక్షి :
JALEEL, KANGTI
కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపిడివోగా సుభాష్ చంద్రగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో దయాకర్ రావు పదవి విరమణ పొందారు.తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్న సుభాష్ సుభాష్ చంద్రగౌడ్ ను కంగ్టి ఎంపీడీవో గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా నూతన ఎంపీడీవో మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి, కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. మండలంలో అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు సహకరించాలన్నారు.









