ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్ గా మారిన డ్రగ్స్ కింగ్ పెన్ అరెస్టు..!
ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన మోస్ట్ వాంటెడ్ కింగ్ పెన్ అబ్దుల్ మిశాలను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు.

ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్ గా మారిన డ్రగ్స్ కింగ్ పెన్ అరెస్టు..!
(ఇబ్రహీంపట్నం మనసాక్షి – శేఖర్)
ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన మోస్ట్ వాంటెడ్ కింగ్ పెన్ అబ్దుల్ మిశాలను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణాలపై ఫ్యూచర్ సిటీ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాలుగా మారిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కింగ్ పెన్ అబ్దుల్ మిషాల్ ను ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో నిందితుడు తారిఖ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
కాగా మహేశ్వరం ఎస్ఓటి ఇబ్రహీంపట్నం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ కేరళకు చెందిన ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లు పట్టుబడినట్లు ప్రాథమిక సమాచారం.ప్రధాన నిందితుడు అబ్దుల్ మిషాల్ తో పాటు తారీకు అరెస్టుతో డ్రగ్స్ నెట్ వర్క్ కు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కాగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు డ్రగ్స్ స్వాధీనం నిందితుల నేర చరిత్రపై పోలీసులు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.









