Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు దుర్మరణం..!
సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బీబీగూడెం నుంచి మార్కెట్కు వెళ్లే మార్గంలో టిప్పర్ లారీ స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు దుర్మరణం..!
సూర్యాపేట, మన సాక్షి :
సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బీబీగూడెం నుంచి మార్కెట్కు వెళ్లే మార్గంలో టిప్పర్ లారీ స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్ర యాణిస్తున్న చివ్వెంల మండల కేంద్రంలోని మినీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిత రెడ్డి, అదే పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయురాలు గుగులోతు రక్మా దుర్మరణం పాలయ్యారు.
విధులకు, ఇతర పనుల నిమిత్తం వెళ్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ప్రమాదంలో ప్రాణాలు కో ల్పోవడంతో విద్యా వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి మృతితో కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే ప్రమాదంలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయుల మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.









