Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం
Miryalaguda : ఏబీవీపీ మిర్యాలగూడ నగర నూతన కార్యదర్శిగా శివ ఎన్నిక
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మిర్యాలగూడ నగర నూతన కార్యదర్శిగా శివ ఎన్నికయ్యారు.

Miryalaguda : ఏబీవీపీ మిర్యాలగూడ నగర నూతన కార్యదర్శిగా శివ ఎన్నిక
మిర్యాలగూడ, మన సాక్షి :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మిర్యాలగూడ నగర నూతన కార్యదర్శిగా శివ ఎన్నికయ్యారు. నవంబర్ 24న నిర్వహించిన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కో-కన్వీనర్ మౌనేష్ చారి శివను నూతన నగర కార్యదర్శిగా ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతన నగర కార్యదర్శి శివ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో నగర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ముందుండి పోరాడుతానని అన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో ఏబీవీపీని మరింత బలోపేతం చేస్తూ, విద్యార్థుల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.









