కార్‌పూలింగ్‌తో ట్రాఫిక్ రద్దీకి చెక్..!
ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కార్‌పూలింగ్, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.

కార్‌పూలింగ్‌తో ట్రాఫిక్ రద్దీకి చెక్..!
(శేరిలింగంపల్లి – శ్రీనివాసచారి)
ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కార్‌పూలింగ్, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి 28 వరకు రాయదుర్గంలోని టీ-హబ్‌లో నిర్వహించనున్న ‘సైబరాబాద్ మూవ్స్–2026’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
కార్లలో ఒక్కరే ప్రయాణించకుండా ఇతరులతో కలిసి వెళ్లాలని, మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సీసీటీవీలు, వాహన గణన యంత్రాల ద్వారా ట్రాఫిక్ రద్దీలో మార్పులను విశ్లేషిస్తామని తెలిపారు. ఫీనిక్స్, ఇన్ఫోసిస్ సంస్థలు కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చాయని వెల్లడించారు.
కార్యక్రమంలో భాగంగా ఐటీ సంస్థలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలతో సమావేశాలు నిర్వహించి ప్రజల సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో ఎస్సీఎస్‌సీ సీఈఓ నవీద్ ఆలం ఖాన్‌తో పాటు పలువురు సీనియర్ ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులు పాల్గొన్నారు.









