Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లా

సారా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం..!

అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలపై బయ్యారం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ మెరుపు దాడులు, కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

సారా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం..!

గార్ల-బయ్యారం సిఐ ఎల్. రవీందర్

(బయ్యారం- సురేష్ బాబు)

అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలపై బయ్యారం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ మెరుపు దాడులు, కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశానుసారం బయ్యారం మండల పరిధి రామచంద్రాపురం గ్రామంలో మంగళవారం పోలీసులు బయ్యారం ఎస్సై ప్రశాంత్ బాబు, గార్ల ఎస్సై సాయికుమార్,పోలీసు సిబ్బందితో కలిసి సిఐ ఎల్. రవీందర్ ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలు పై దాడులు నిర్వహించారు.

గుడుంబా తయారీకి వినియోగిస్తున్న సుమారు 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.25 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని ఆరు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, అసాంఘిక కార్యక్రమాలు,నిషేధిత గుడుంబా,నల్లబెల్లం,పట్టిక, గంజాయి ఇతర మత్తు పదార్థాలు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యువత గంజాయి,మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు,గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు.

అక్రమ మద్యం తయారీ, విక్రయాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో చట్టవిరుద్ద కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి నేరరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

మరిన్ని వార్తలు