Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డివిద్యహైదరాబాద్

మేడ్చల్ జిల్లాలో కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మెద్చల్ జిల్లాలో యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం (యూఎస్‌పీఎఫ్) ఆధ్వర్యంలో ఉప్పల్ శ్రీరస్తు కన్వెన్షన్ లో నిర్వహించిన కరస్పాండెంట్లు, ఉపాధ్యాయుల భారీ సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగింది.

మేడ్చల్ జిల్లాలో కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులకు ఘన సన్మానం

(ఉప్పల్ – కిషోర్)

మెద్చల్ జిల్లాలో యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం (యూఎస్‌పీఎఫ్) ఆధ్వర్యంలో ఉప్పల్ శ్రీరస్తు కన్వెన్షన్ లో నిర్వహించిన కరస్పాండెంట్లు, ఉపాధ్యాయుల భారీ సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యారంగానికి విశేష సేవలందిస్తున్న 500 మందికి పైగా పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

ఇంత పెద్ద సంఖ్యలో విద్యారంగ ప్రముఖులను ఒకే వేదికపై గౌరవించడం ద్వారా మెద్చల్ జిల్లాలో ఈ కార్యక్రమం ప్రత్యేక గుర్తింపు పొందింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మెఘా, ఓమెగా విద్యాసంస్థల ఛైర్మన్ ఎన్. మోహన్ రెడ్డి, మాలతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మక్బూల్ జానీ తదితరులు హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా యూఎస్‌పీఎఫ్ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షుడు బి. విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులను ఒకే వేదికపై సన్మానించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ వేడుక కేవలం సన్మాన కార్యక్రమం మాత్రమే కాదని, విద్యారంగంలో పనిచేస్తున్న వారందరి ఐక్యతకు, పరస్పర గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన యూఎస్‌పీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కబీర్ మహ్మద్, ఉపేందర్, గడ్డం సాయి, రాజు, ఎల్. సందీప్, కె. జగదీష్ జోషి, తిమోతి, చందన, లక్ష్మీ దేవమ్మ, వెంకటేశం తదితరులను ప్రత్యేకంగా అభినందించారు.

Also Read : కార్‌పూలింగ్‌తో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..!

అలాగే కార్యక్రమానికి సహకారం అందించిన మెఘా, ఓమెగా విద్యాసంస్థల ఛైర్మన్ మోహన్ రెడ్డి, మాలతి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయుడు, జిల్లా నాయకుడు, నిర్వాహకుడు, యూఎస్‌పీఎఫ్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

500 మందికి పైగా విద్యారంగ ప్రముఖులకు సన్మానం చేయడం ద్వారా యూఎస్‌పీఎఫ్ తన ఐక్యతను, విద్యారంగం పట్ల తన నిబద్ధతను చాటుకుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఏ కష్టం వచ్చినా ప్రతి పాఠశాల కరస్పాండెంట్‌కు యూఎస్‌పీఎఫ్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు