BREAKING NEWS : ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్, ఢిల్లీలో మహిళపై సామూహిక హత్యాచారం.. మన సాక్షి బ్రేకింగ్ న్యూస్, ఓకే క్లిక్ లో మరెన్నో..!
మనసాక్షి పత్రిక, వెబ్ సైట్ స్థానికం నుంచి జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. ఈరోజు మీకోసం బ్రేకింగ్ న్యూస్..

BREAKING NEWS : ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్, ఢిల్లీలో మహిళపై సామూహిక హత్యాచారం.. మన సాక్షి బ్రేకింగ్ న్యూస్, ఓకే క్లిక్ లో మరెన్నో..!
మనసాక్షి, వెబ్ డెస్క్:
మనసాక్షి పత్రిక, వెబ్ సైట్ స్థానికం నుంచి జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. ఈరోజు మీకోసం బ్రేకింగ్ న్యూస్..
జడ వేసుకోలేదని విద్యార్థిని
ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్..!
స్కూల్లో జడ వేసుకోలేదని..
ఎముకలు విరిగేలా టీచర్ విద్యార్థినిని కొట్టింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘటన జరిగింది. 8వ తరగతి విద్యార్థిని జడ వేసుకోలేదని.. కరెంట్ పైప్‌తో ఇంగ్లీష్ టీచర్ మంజుల దారుణంగా కొట్టింది.
టీచర్ కొట్టిన దెబ్బల కారణంగా రెండు చేతులకు వాపులు వచ్చాయి. ఎక్స్‌రే తీయించగా.. ఎముకలు పని చేయని స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థిని తండ్రి కోరుతున్నారు.
ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్యాయత్నం.. తల్లి, కుమారుడు మృతి..!
భర్త లేని లోకంలో బతకలేక.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఎలుకల మందు కలిపిన బాదం పాలు తాగి తల్లీకుమారుడు మృతి చెందారు. మృతులు షేక్ రంజాన్‌బీ (29), చిన్న కుమారుడు నహీం (6) మరో కుమారుడు నిస్సాన్ఉద్దీన్ (8)కు హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. రంజాన్‌బీ తొమ్మిదేళ్ల క్రితం అక్బర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త అక్బర్ మృతి చెందాడు. భర్త మరణం తర్వాత తీవ్ర మనోవేదనతో ఉన్న రంజాన్‌బీ ఈ ఘటనకు పాల్పడింది.
Also Read : సెప్టిక్ ట్యాంక్ లో దిగి ముగ్గురు మృతి
దీపం వెలిగిస్తూ చీరకు మంటలు అంటుకుని మహిళ మృతి
దీపం వెలిగిస్తూ చీరకు మంటలు అంటుకుని మహిళ మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ – ఎస్ఆర్ నగర్ పరిధిలో దీపం వెలిగిస్తూ ప్రమాదవశాత్తు చీరకు మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన భానుమతి (62) అనే మహిళ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ప్రమాదంలో సోఫా, ఏసీ పూర్తిగా కాలిపోయినట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో మరో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..!
తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో ఓ కేఫ్‌లో మహిళపై తోటి ఉద్యోగులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో కేఫ్ క్లోజ్ చేసిన అనంతరం కేఫ్‌లోకి వెళ్లి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
Also Read : Gold Price : బంగారం ధర భారీగా పతనం.. ఒక్కరోజులో భారీగా తగ్గిన ధర, ఈరోజు ఎంతంటే..!
కర్ణాటకలో విషాదం :
కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. హాసన్‌కు చెందిన 23 ఏళ్ల ఐశ్వర్య తన ప్రియుడు సంతోష్‌తో కలిసి నవంబర్ 19న గంగమ్మగుడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తనను ఎవరూ నమ్మడం లేదంటూ ఐశ్వర్య మనస్తాపానికి గురైన సమయంలో, సంతోష్ ఆమెను తోసేయడంతో కిటికీలోంచి కిందపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సంతోష్‌ను అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.









