Miryalaguda : మిర్యాలగూడలో భక్తి శ్రద్దలతో ఘనంగా శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హనుమాన్ జంక్షన్ వై జంక్షన్ లో ఆదివారం శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా వేలాదిమంది భక్తుల మధ్య జరిగింది.

Miryalaguda : మిర్యాలగూడలో భక్తి శ్రద్దలతో ఘనంగా శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హనుమాన్ జంక్షన్ వై జంక్షన్ లో ఆదివారం శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా వేలాదిమంది భక్తుల మధ్య జరిగింది. విగ్రహ ప్రతిష్టతో పాటు నవగ్రహ విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి దంపతులు, మునిసిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ దంపతులు, దేవాలయ కమిటీ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ నాగలక్ష్మి దంపతులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆదివారం ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జైశ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో ఆలయం మారుమోగింది. విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు బండారు కుశలయ్య, కోశాధికారి గందె రాము, వివిధ పార్టీలకు చెందిన నాయకులు మిట్టపల్లి వెంకటేష్, గొంగిడి సైదిరెడ్డి, బంటు శ్రీనివాస్, గూండా నాగరాజు, బంటు లక్ష్మీనారాయణ, తిరుమలగిరి వజ్రం, విజయ్ందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












