Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయం

విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష, రెండు వేల జరిమానా – latest news

విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష, రెండు వేల జరిమానా

న్యూఢిల్లీ,  మనసాక్షి: కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన లిక్కర్ కింగ్ విజయ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు 2000 రూపాయల జరిమానా కూడా విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జరిమానా చెల్లించాలి. లేదంటే మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. 2017 నాటి కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల ( సుమారు 317 కోట్లను) ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ మొత్తాన్ని వినియోగించడానికి వీల్లేదని నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 8% వడ్డీ సహా రూ. 317 కోట్ల మొత్తాన్ని నాలుగు వారాల్లో తిరిగి ఇచ్చేయాలని మాల్యా పిల్లలకు సూచించింది.

ALSO READఫ్లాష్.. ఫ్లాష్.. మిర్యాలగూడలో కారును ఢీకొన్న డీసీఎం, హోటల్లోకి దూసుకుపోయిన కారు

నగదు రిటర్న్ చేయకపోతే విజయ్ మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చని తెలిపింది. నగదు రికవరీలో సంబంధిత ఆఫీసర్ కి ప్రభుత్వం అన్ని ఏజెన్సీలు సహకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన విజయమాల్య పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్బిఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ తీర్పు వెలువరించినది. విజయ్ మాల్యా నిబంధనలకు విరుద్ధంగా తన కొడుకు సిద్ధార్థ మాల్య, కూతుర్లు లెన్న మాల్య, తన్యామాల్యలకు నగదు ట్రాన్స్ఫర్ చేశారు. హైకోర్టు ఆదేశాలకు ఇది విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నాయి.

ALSO READ : BREAKING : మోడీ విశ్వ గురువు కాదు, విష గురువు – కేసీఆర్

కాగా పలాయనం చిత్తగించిన విజయ్ మాల్యా భారత బ్యాంకుల నుంచి సుమారు 9000 కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన విషయం తెలిసిందే. కింగ్ ఫిషర్, ఎయిర్లైన్స్ పేరిట ఈ భారీ మొత్తంలో లోన్లు తీసుకున్న విషయం తెలిసిందే. 2016 నుంచి మాల్యా యూకే లోనే ఉంటున్నాడు.

మరిన్ని వార్తలు