ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్..!

అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగను సోమవారం గుర్తించి పట్టుకునట్లు చర్ల సి ఐ రాజువర్మ తెలిపారు.

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్..!

చర్ల,మనసాక్షి:

అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగను సోమవారం గుర్తించి పట్టుకునట్లు చర్ల సి ఐ రాజువర్మ తెలిపారు. ఈ సందర్భంగా సి ఐ రాజు వర్మ మాట్లాడుతూ ఈ ద్విచక్ర వాహనాల దొంగ దుమ్మగూడెం మండలం పైడి గుడెం గ్రామానికి చెందిన వ్యక్తి అని ఇతని పేరు కనితి వెంకటేశ్వరరావు అని తెలిపారు.

భద్రాద్రి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో ఇతనిపై 20 కేసులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. ఇతను పై గతంలో పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడమే కాకుండా ఇతను జైలు జీవితం కూడా అనుభవించినట్లు మా విచారణలో తేలిందని వారు తెలిపారు.

ఇతను తెలంగాణ ఒరిస్సా సతీష్గడ్ రాష్ట్రాలలో తిరుగుతూ ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ వాటిని ఇతర ప్రాంతాలలో విక్రయిస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు మా విచారణలో తేలిందని వారన్నారు.అనంతరం పట్టుబడ్డ అతని వద్ద నుండి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం పర్చుకోవడం జరిగిందని చర్ల సి ఐ రాజు వర్మ స్పష్టం గా తెలిపారు.

ALSO READ : BREAKING : మైనర్ బాలికపై వేధింపులు.. ఫోక్సో కేసు నమోదు..!