ప్రమాదవశాత్తు బోర్డు మీద పడి సఫాయి కార్మికుడు మృతి..!

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్రభుత్వ దవాఖానాలోని గురువారం  ఉదయం వాటర్ ట్యాంక్ క్రింద పనిచేస్తూ ప్రమాదవశాత్తు సఫాయి కార్మికుడి మృతి

ప్రమాదవశాత్తు బోర్డు మీద పడి సఫాయి కార్మికుడు మృతి..!

ధర్మారం , మన సాక్షి ప్రతినిధి :

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్రభుత్వ దవాఖానాలోని గురువారం  ఉదయం వాటర్ ట్యాంక్ క్రింద పనిచేస్తూ ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్ యొక్క వాటర్ లెవెల్ చూపు బోర్డుపై నుండి వచ్చి ఎల్తూరి సత్తయ్య అనే సఫాయి కార్మికుడి పై పడగా అతడికి ఎడమ భుజం వెనుక వైపు తీవ్ర గాయం కాగా అతడిని వెంటనే కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు సత్తయ్య భార్య శంకరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టీ సత్యనారాయణ తెలిపారు.

మృతి చెందిన సపాయి కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : 

రాష్ట్రవ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా గ్రామపంచాయతీ లలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని సపాయి కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని విధులలో మృతి చెందిన సఫాయి కార్మికుడైన ఎల్తూరి సత్తయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని దళిత సంఘాల నాయకులు సుంచు మల్లేశం, పెర్క బానేష్, బొల్లి నందయ్య,దూడ సురేష్,శ్రీధర్, రాజ్ కుమార్ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.