Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణ

Gold Price : పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. బంగారం ధర మరింత పతనం, ఈరోజు ధర ఎంతంటే.!

పసిడి ప్రియులకు భారీ శుభవార్త అందింది. బంగారం ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. రెండు రోజుల కాలంలోనే తులం బంగారంకు 7500 రూపాయలు తగ్గింది.

Gold Price : పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. బంగారం ధర మరింత పతనం, ఈరోజు ధర ఎంతంటే.!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ప్రియులకు భారీ శుభవార్త అందింది. బంగారం ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. రెండు రోజుల కాలంలోనే తులం బంగారంకు 7500 రూపాయలు తగ్గింది. తులం బంగారం లక్షన్నర కు పైగా ఉన్న ధర ఇప్పుడు రెండు రోజుల్లో భారీగా పడిపోయింది. దాంతో కొనుగోలుదారులకు పండగ వాతావరణం నెలకొన్నది. ఈనెల 10వ తేదీన తులం బంగారం కు 24 క్యారెట్ కు 5390 రూపాయలు ధర తగ్గగా, 11వ తేదీన 2130 రూపాయలు తగ్గింది. దాంతో ధర భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషంగా ఉన్నారు.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు గురువారం ఒక్కరోజే 21, 300 రూపాయలు ధర తగ్గింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 19,500 ధర తగ్గింది. అదేవిధంగా 10 గ్రాముల తులం 24 క్యారెట్ కు 2130 రూపాయలు ధర తగ్గి 1,45,640 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ కు 1950 రూపాయలు ధర తగ్గి 1,33,500 రూపాయలకు ధర చేరింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలైనా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కాకినాడ తదితర పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

MOST READ NEWS : 

మరిన్ని వార్తలు