Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District Collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఆదాయం పెరగాలంటే అలా సాగు చేయాలి..! 

పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం వార్షిక ప్రణాళికపై సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సమీక్షా సమావేశం నిర్వహించారు.

District Collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఆదాయం పెరగాలంటే అలా సాగు చేయాలి..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం వార్షిక ప్రణాళికపై సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ సహజ మరియు సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించడం మరియు రైతుల ఆదాయాలు, గ్రామీణ జీవనోపాధికి మద్దతు ఇస్తూ స్థిరమైన వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయాన్ని స్వీకరించడమే పథకం ఉదేశ్యం అన్నారు.

అయితే జిల్లాలో ఆ పథకం అమలుకు సంబం ధిత శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబం ధించిన వార్షిక ప్రణాళికను అమలు చేసేందుకు సమన్వ యంతో కృషి చేయాలని సూచించారు. వార్షిక ప్రణా ళిక అమలులో ఇన్నోవేటివ్ ఉండాలన్నారు. అంతకు ముందు ఆ పథకం నోడల్ అధికారి సాయిబాబా మాట్లాడుతూదేశంలోని 100 జిల్లాలలో నారాయణపేట జిల్లా ఈ పథకం కింద ఎంపిక కావడం ఈ ప్రాంత అభివృ ద్ధికి శుభ పరిణామం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం కింద ఎంపికైన నాలు గు జిల్లాలలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నే మూడు జిల్లాలు నాగర్ కర్నూల్, గద్వాల, నారాయ ణపేట ఎంపిక కావడం జరిగిందని ఆయన క్లుప్తంగా వివరించారు. గత జనవరి 3, 4,న జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ కో ఆపరేషన్/ పీఎండిడికేవై సెంట్రల్ నోడల్ అధికారి రమణ్ కుమార్ నారాయణ పేట జిల్లాలో పర్యటించి పథకం అమలు తీరును పర్యవేక్షించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ వెంకట్ రాము లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, జిల్లా మత్స్య శాఖ అధికారి రెహమాన్, డిపివో సుధాకర్ రెడ్డి, ఎల్ డీ ఎం విజయ్ కుమార్, నాబార్డు అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు