Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : ప్రజాస్వామ్యానికి పునాది బూత్ లెవెల్ ఏజెంట్లు..! 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది.

Miryalaguda : ప్రజాస్వామ్యానికి పునాది బూత్ లెవెల్ ఏజెంట్లు..! 

మిర్యాలగూడ, జూన్ 10, మన సాక్షి :

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్,
నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత, రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ మాసనపల్లి లింగాజీ ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది ఓటరు జాబితా. ప్రతి అర్హుడైన వ్యక్తికి ఓటు హక్కు కల్పించేలా బీ ఎల్ ఏ లు బాధ్యతాయుతంగా పనిచేయాలని,
బూత్ లెవెల్ ఏజెంట్లు పార్టీకి మరియు ప్రజలకు మధ్య వారధిలా ఉంటారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ మరియు ఓట్ల తొలగింపు ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడంలో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో బూత్ లెవెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు