Suicide : పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామానికి చెందిన సొప్పరి సత్తయ్య (61) వ్యక్తి పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.

Suicide : పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

లక్షేట్టిపేట్, (మన సాక్షి);

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామానికి చెందిన సొప్పరి సత్తయ్య (61) వ్యక్తి పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మృతుడు గత మూడు రోజులుగా కడుపు నొప్పితో అవస్థ పడుతున్నాడు. భార్య ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందాం అంటే పండగ తర్వాత వెళ్దాం మాత్రలు వేసుకుంటే తగ్గిపోద్ది అంటుండే వాడని.

బుధవారం రాత్రి కూడా కడుపునొస్తుంది అని భార్యతో చెప్పి తిని పడుకున్నాడు. ఉదయాన్నే లేచి పొలంకు మందు కొట్టాలని చెప్పి ఇంట్లో ఉన్న మందు ప్యాకెట్ తీసుకొని చెల్లంపేట రావికుంట చెరువు పక్కన ఉన్న పొలం వద్దకు వెళ్లి చెరువు కట్ట పై బైక్ పెట్టి మద్యంలో ఇంటి నుండి తెచ్చుకున్న పంటకు కొట్టే మందు కలుపుకొని తాగి చనిపోయాడు. మృతుడి భార్య సొప్పరి గంగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్షెట్టిపేట్ ఎస్సై చంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ALSO READ : Suicide : 12 రోజుల్లో పెళ్లి.. అంతలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఆత్మహత్య..!