Suicide : 12 రోజుల్లో పెళ్లి.. అంతలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఆత్మహత్య..!

12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Suicide : 12 రోజుల్లో పెళ్లి.. అంతలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఆత్మహత్య..!

శేరిలింగంపల్లి , మన సాక్షి :

12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు గచ్చిబౌలి ఎస్ ఐ భాను ప్రసాద్ వివరాల ప్రకారం రాజన్న సిలిసిల్ల జిల్లాకు చెందిన విద్యా శ్రీ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో ఉంటోంది. ఈ నెల మార్చి 17న యువతికి వివాహం నిశ్చయం అయ్యింది.

కాబోయే భర్తతో గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్‌కు విద్యాశ్రీ వెళ్లాల్సి ఉంది. అయితే అంతలోనే సోమవారం హాస్టల్ గదిలోని బాత్ రూంలో షవర్ రాడ్‌కు ఉరి వేసుకొని యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన గచ్చిబౌలి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ALSO READ : BREAKING : నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుమలకు వెళ్లి వస్తుండగా హైదరాబాదు వాసులు ఐదుగురు మృతి..!