Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రాంగ్ పార్కింగ్ లో ఉన్న ట్రాలీ ఆటో ఢీకొని.. ద్విచక్ర వాహనదారుడు మృతి..!

Miryalaguda : రాంగ్ పార్కింగ్ లో ఉన్న ట్రాలీ ఆటో ఢీకొని.. ద్విచక్ర వాహనదారుడు మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై రాంగ్ పార్కింగ్ లో ఆటో ట్రాలీని నిలపడంతో ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో చోటుచేసుకుంది.

మిర్యాలగూడ రూరల్ ఎస్సై లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా నందివాడ మండలం అరపిరాల గ్రామానికి చెందిన గోగులముడి తంబి (40) వైట్ పిఎస్ లో వెల్డింగ్ పని చేస్తున్నాడు. హోండా యాక్టివా పై సోమవారం ఉదయం వాడపల్లి నుంచి మిర్యాలగూడ వస్తుండగా గూడూరు సమీపంలో ఆటో ట్రాలీ రాంగ్ పార్కింగ్ లో నిలిపి ఉంది.

స్కూటీ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. కాగా రాత్రి 7 గంటలకు మృతి చెందాడు. మృతుడికి ఒక కుమార్తె ఉన్నది. మృతుడి భార్య ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నది. అతని భార్య ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

MOST READ :

మరిన్ని వార్తలు