కదులుతున్న బస్సు ఎక్కిన మహిళ.. డ్రైవర్ ఆమె పాలిట దేవుడయ్యాడు.. (వీడియో)

హైదరాబాద్ రోడ్లపై నిత్యం రద్దీగా ఉంటుంది. ఆర్టిసి బస్సులు కిటకిటలాడుతుంటాయి. ఏ బస్సు ఎక్కాలి అన్న ప్రయాణికులు ఎక్కువమంది ఉంటారు. ఇప్పుడు మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మరింత ప్రయాణికుల సంఖ్య పెరిగింది.

కదులుతున్న బస్సు ఎక్కిన మహిళ.. డ్రైవర్ ఆమె పాలిట దేవుడయ్యాడు.. (వీడియో)

మన సాక్షి , హైదరాబాద్ :

హైదరాబాద్ రోడ్లపై నిత్యం రద్దీగా ఉంటుంది. ఆర్టిసి బస్సులు కిటకిటలాడుతుంటాయి. ఏ బస్సు ఎక్కాలి అన్న ప్రయాణికులు ఎక్కువమంది ఉంటారు. ఇప్పుడు మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మరింత ప్రయాణికుల సంఖ్య పెరిగింది. హైదరాబాదులో ఓ మహిళ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆర్టీసీ బస్సు కదులుతుండగా ఎక్కబోయి కింద పడిపోయింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ మహిళ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ ఆ సమయంలో ఆమె కింద పడింది. ఆమె కింద పడిన సమయంలోనే బస్సు బయలుదేరుతుంది. కానీ కింద పడిన మహిళను చూసిన ఆ బస్సు డ్రైవర్ వెంటనే ఆపాడు.

అదృష్టవశాత్తు ఆ మహిళకు ఏమీ కాలేదు. ఆ సమయంలో ఆమెకు ఆ బస్సు డ్రైవర్ దేవుడయ్యాడు. ఈ వీడియో తీసిన వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. చూసినవారు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.