హాజరు వేయకుండా వేతనాల చెల్లింపులు..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై సంబంధిత అధికారులే జవాబుదారీగా ఉండాలని జిల్లా అదనపు పీడీ వామన్ రావు అన్నారు.

హాజరు వేయకుండా వేతనాల చెల్లింపులు..!

ఉపాధి హామీ అవకతవకలపై ప్రజా వేదిక ..!

కంగ్టి, మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై సంబంధిత అధికారులే జవాబుదారీగా ఉండాలని జిల్లా అదనపు పీడీ వామన్ రావు అన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలోని అన్నీ గ్రామాల్లో వారం రోజులుగా నిర్వహించిన 13వ విడత సోషల్‌ ఆడిట్‌పై బుధవారం ప్రజాదర్భార్‌ నిర్వహించారు.

ALSO READ : సూర్యాపేట : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం..!

ఈ సందర్భంగా అన్నీ గ్రామాల్లో ఒక పరిశీలన బృందాలు 2022 -2023 వరకు మొత్తం ఈజీఎస్ రూ.3,78,27,117 కోట్లు కూలీలకు వేతనాలు చెల్లించగా, 32,83,081 కోట్లు మెటల్ కాంపోనెంట్ కింద అభివృద్ధి పనులు చేపట్టారు.

హరితహారం, రోడ్లు ఏర్పాటు, కందకాలు తవ్వడం, రాళ్ల కట్టలు వేయడం తదితర పనులను పరిశీలించి వివారాలు నమోదు చేసుకొన్నారు. అయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి ఉపాధి కూలీలు, ప్రజల సమస్యలు తెలునుకొన్నారు. వారి నివేదికలను ప్రజావేదికలు డిఆర్పీలు చదవడంతో వీటిపై అధికారులు సమీక్షించారు. హాజరు లేకుండా పని వేతనాలు చెల్లించడం వంటి తప్పిదాలు జరిగాయి.

ALSO READ : Runa mafi : రైతు రుణమాఫీ పై రేవంత్ గుడ్ న్యూస్..!

ఈ సందర్భంగా ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్, భోజిరెడ్డి హాజరయ్యారు.వీటిపై సంజాయిషీ తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి సంగీత వెంకటరెడ్డి, ఎంపిడిఓ ముజఫరోద్దీన్, ఎంపీవో లు నర్సింలు, బస్వరాజ్, సి ఆర్ పి శ్రీనివాస్, టీఎస్, ఈసీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.