AC : ఏసి వాడితే.. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా…? ఇలా చేయండి చాలు..!
AC : ఏసి వాడితే.. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా…? ఇలా చేయండి చాలు..!
మనసాక్షి వెబ్ డెస్క్:
వేసవికాలంలో చల్లదనం కోసం ఏసీ వాడుతున్నారా..? ఏసి వాడితే కరెంట్ బిల్లు మోత మోగుతుంది.. ఇది అందరికి తెలిసిన విషయమే. రోజంతా ఏసీ వాడినా.. కూడా కరెంటు బిల్లు తక్కువ రావాలని కోరుకుంటారు. అది ఎలా అంటే ఏసి వాడకంలో కొన్ని టిప్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. టిప్స్ ఉపయోగిస్తే కరెంట్ బిల్లు సగం ఆదా అవుతుంది.
ప్రస్తుతం వేసవికాలంలో తెలుగు రాష్ట్రాలలో ఎండల విపరీతంగా ఉన్నాయి. 40 డిగ్రీల పైననే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల 42, 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. దీంతో వడదెబ్బతో కొంతమంది మృతి చెందుతున్నారు. అదేవిధంగా వడదెబ్బ బారిన పడినవారు చికిత్సలు కూడా పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. అత్యవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళలో బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.
ఇంట్లో ఉన్నా కూడా ఎండ వేడిమి కి తట్టుకోవడానికి ఏసీలు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏసి వాడితే వేలకు వేలు కరెంటు బిల్లులు వచ్చే పరిస్థితి రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఎసీ వాడినా కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. చాలామంది 24 గంటలు ఏసీ ఆన్ లోనే ఉంచుతారు. దానివల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. గతంలో ఉన్న కరెంటు బిల్లు కంటే నాలుగింతలు ఎక్కువగా వస్తుంది.
ఉష్ణోగ్రత సరైన మోతాదులో ఉంచాలి :
ఏసిని 16 లేదా 18 డిగ్రీల ల వద్ద ఉంచడం ద్వారా కూలింగ్ వస్తుందని భావిస్తుంటారు. కానీ 24 డిగ్రీల వద్ద అదే చల్లదనం మీకు అందుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం.. మానవ ఉష్ణోగ్రత 24 ఉంటుంది. కాగా మీరు ఏసిని 24 మీద ఉంచండి. దాంతో విద్యుత్తు ఆదా అవుతుంది. ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడం ద్వారా ఆరు శాతం విద్యుత్ బాధ అవుతుంది.
గదిలోకి సూర్యకిరణాలు రాకుండా చూడాలి
శరీరానికి ఎండ తగలడం మంచిదే. అయినా కూడా వేసవిలో మధ్యాహ్నం సమయంలో వేడి తగలడం వల్ల వడదెబ్బ తలగిలే అవకాశం ఉంటుంది. దానివల్ల డిహైడ్రేషన్ సమస్యలు కూడా వస్తాయి. దాంతో మీరు ఏసి ఉపయోగించే గదిలోకి సూర్య కిరణాలు రాకుండా కిటికీలకు, డోర్లకు కర్టన్లను ఉపయోగించాలి. ఏసీ గాలి బయటకు పోకుండా… సూర్యకిరణాలు లోపలికి రాకుండా ఉండాలి.
ఎయిర్ ఫిల్టర్ శుభ్రంగా ఉంచుకోవాలి :
వేసవికాలం ప్రారంభమైయ్యే సరికి ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానిని మనం వాడకుండా పక్కన పెట్టడం వల్ల ఎయిర్ ఫిల్టర్ లో దుమ్ము, ధూళి చేరిపోతుంటాయి . ఈ కారణంగా గాలి సరిగా రాకపోవడం వల్ల గది త్వరగా చల్లబడదు. అందుకని ఏసీ ఫిల్టర్ ని శుభ్రం చేయించుకోవాలి. ప్రతి 60 రోజులకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ని శుభ్రం చేయించుకోవడం మంచిది .
ఏసీలలోని అన్ని కంపెనీలు కూడా స్లీప్ మోడ్ ఫీచర్ ని తీసుకొచ్చాయి. ఈ ఆప్షన్ వల్ల మీకు 36% విద్యుత్ ఆదా అవుతుంది. అవసరంలేని సమయాల్లో , బయటకు వెళ్తున్నప్పుడు, ఉదయం పూట, వాతావరణం చల్లగా ఉన్న సమయాలలో స్లీప్ మోడ్ లో ఉంచటం ద్వారా విద్యుత్ ఆదా చేసుకోవచ్చును.
సీలింగ్ ఫ్యాన్ ఆన్ లో ఉంచాలి.
సాధారణంగా అందరూ ఏసి ఆన్ లో వచ్చినప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేయడం వల్ల ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందని భావిస్తారు. కానీ వేసి వేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాన్ వేయకుంటే చల్లని గాలి రూమ్ అంతా వ్యాపించే సమయానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా ఫ్యాన్ వేయడం వల్ల త్వరగా గది మొత్తం చల్లగా అవుతుంది.
దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది. ఇలా టిప్స్ ఉపయోగించడం వల్ల విద్యుత్ ఆదా అవుతున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి.









