జంమ్గి కె గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి కె,గేటు వద్ద ఏపీ.39.విఏ.8849, నెంబరు గల ఐచర్,వాహనం అతివేగంతో అదుపుతప్పి ఏపీ25.ఏజే.9236, నెంబరు గల హెచ్ఎఫ్ డీలక్స్ టు వీలర్ వాహనంపై దూసుకు వెళ్ళింది.

జంమ్గి కె గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..!

ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు ,

కంగ్టి , మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి కె,గేటు వద్ద ఏపీ.39.విఏ.8849, నెంబరు గల ఐచర్,వాహనం అతివేగంతో అదుపుతప్పి
ఏపీ25.ఏజే.9236, నెంబరు గల హెచ్ఎఫ్ డీలక్స్ టు వీలర్ వాహనంపై దూసుకు వెళ్ళింది.

కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలోని చిల్లర్గి, గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పండరి, భార్య వినోద,ఇద్దరు కుమారులు హర్షిత్, అనుషిత్,లతో కలిసి చిల్లర్గి,గ్రామం నుంచి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్, గ్రామంలో బావ ధర్పల్లి బాబు, ఇంటికి వెళుతుండగా తడ్కల్ సమీపంలోని జంమ్గి గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు.

ALSO READ : రేవంత్ రెడ్డి అరెస్ట్.. గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

ప్రమాదానికి గురి అయిన క్షతగాత్రులను ఉటావుటీన 108 వాహనంలో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పండరి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

మృతుని భార్య వినోద,హర్షిత్, అనుషిత్,లను చికిత్స కొరకై నిజాంబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  వాహనం డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.

ALSO READ : నల్లగొండలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు కౌన్సిలర్లు..!