స్నేహితుడిని కలిసేందుకు వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో మృతి..!

తన స్నేహితుని మాచపూర్ లో కలిచేందుకు వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

స్నేహితుడిని కలిసేందుకు వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో మృతి..!

దుబ్బాక, మనసాక్షి :

తన స్నేహితుని మాచపూర్ లో కలిచేందుకు వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయని దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపారు. దుబ్బాక పట్టణానికి చెందిన అంబేద్కర్ సంఘ మాజీ అధ్యక్షుడు అస చిన్న ముత్యం కుమారుడైన అస సాగర్ (22) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

మంగళవారం రాత్రి మాచాపూర్ లోని తన సోదరుని కలిచేందుకు తన తండ్రి హోండా షైన్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు బల్వంతపూర్ గ్రామ వడ్డెర కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కల ఉన్న జెసిబి గుంతలో పడ్డాడు. తలకి తీవ్రమైన గాయాలు తగలడంతో సాగర్ మృతి చెందాడు.

మాచాపూర్ వెళ్తుండగా బైక్ పై మరొక యువకుడు జీడి దినేష్ ను ఎంత పెట్టుకుని పోయాడు. ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించడం జరిగిందని ఎస్సై గంగరాజు తెలిపారు.