Accident : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలోని చోంపాపురం గ్రామానికి యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Accident : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మెలియాపుట్టి. మన సాక్షి:

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలోని చోంపాపురం గ్రామానికి యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని చొంపాపురం గ్రామానికి చెందిన యవ్వారి ప్రసాద్ (35) అనే యువకుడు కరజాడ లో తన అత్తవారి ఇంటికి వెళ్ళి తిరిగి తన ఇంటికి వస్తున్న తరుణంలో తంగిణి కి సమీపంలో బస్సును అధిగమించేందుకు తన ద్వీచక్రవాహనంతో ప్రయత్నించగా అదుపుతప్పి ప్రమాదానికి గురై మృతి చెందాడు.

ఈయనకు భార్య దీపిక, నాలుగు నెలల కుమార్తె ,తల్లి వసంత ఉన్నారు. యువకుడు మర్చంట్ నావీ లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారని ఇటీవల సెలవు పై ఇంటికి వచ్చినట్టు గ్రామాస్తులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి. రాజేష్ తెలిపారు.