Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

Additional Collector : అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జీవి శ్యాంప్రసాద్ లాల్ శుక్రవారం మండల పరిధిలోని చొక్కన్నపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు రామకృష్ణ సాగు చేస్తున్న మునగ తోటను పరిశీలించారు.

Additional Collector : అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

వెల్దండ, మన సాక్షి:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జీవి శ్యాంప్రసాద్ లాల్ శుక్రవారం మండల పరిధిలోని చొక్కన్నపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు రామకృష్ణ సాగు చేస్తున్న మునగ తోటను పరిశీలించారు. తోట నిర్వహణ మొక్కల పెరుగుదల నీటి వినియోగ భృతి విచారణ పరిశీలించి రైతులకు మరింత సాంకేతిక మార్గదర్శకత అందించాలని అధికారులకు సూచించారు.

అనంతరం బొల్లంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన ఆవుల షెడ్డు సందర్శించి, పశుసంవర్ధక కార్యకలాపాలకు ఉపయోగంగా ఇండియాలో నిర్వహణపై దృష్టి పెట్టాలని తెలిపారు.బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ అధికారులను ఈ సందర్భంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ చిన్న ఓబులేసు, ఏపీ డి చంద్రశేఖర్, ఎంపీఓ లక్ష్మణ్ నాయక్, ఏపీవో ఈశ్వర్ జి, ఏపీఎం జంగయ్య, సంతోష్, ఈసీ దేవేందర్, టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ, సర్పంచులు సత్తూరి ప్రసాద్ గౌడ్, జక్కుల శిరీష వెంకటేష్, ఉప సర్పంచ్ రామకృష్ణ,ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుడు కొర్ర శివ నాయక్, ఐకెపి సీసీలు, క్షేత్ర సహాయకులు, కార్యదర్శి అన్నపూర్ణ, మరియు బొల్లంపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ

మరిన్ని వార్తలు