Additional Collector : ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్..!
Additional Collector : ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్..!
కరీంనగర్, మన సాక్షి :
కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను అదరపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ ఆర్డీవో కే. మహేశ్వర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం, వివిప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు.
ఈవిఎం ల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాo వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈవియం గదుల వి వి ప్యాట్ గదుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బిఆర్ ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్ , బిజెపి పార్టీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, ఎంఐఎం పార్టీ ప్రతినిది అబ్బాస్ సమీ, బర్కత్ ఆలీ, టిడిపి పార్టీ ప్రతినిది కళ్యాడపు ఆగయ్య తదితరులు పాల్గోన్నారు.
MOST READ :
-
Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!









