Nalgonda : నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ హాస్టల్ లో అద్వాన్నం.. విద్యార్థినిలకు అస్వస్థత, ఎమ్మెల్యే బాలు నాయక్ ఆగ్రహం..!
Nalgonda : నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ హాస్టల్ లో అద్వాన్నం.. విద్యార్థినిలకు అస్వస్థత, ఎమ్మెల్యే బాలు నాయక్ ఆగ్రహం..!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా పీఏ పల్లి దుగ్యాల మోడల్ స్కూల్ హాస్టల్ లో బాలికలకు ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తినడం వల్ల సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత దాదాపు 10 మంది విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు గురయ్యారు. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. హాస్టల్ ఎస్ ఓ,కేటేకర్, ఇద్దరు విషయం బైట పోకుండా కప్పి పుచ్చి ఉంచారు.
మంగళవారం ఉదయం నుంచే విద్యార్థులు కడుపు నొప్పి తో బాధపడుతుంటే లోకల్ ఆర్ఎంపీ కాడికి తీసుకో పోవడం జరిగింది. ఆర్.ఎం.పి ఇచ్చిన మందులతో తక్కువ కాక పోవడం వలన దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఉదయం హాస్టల్ లో పల్నాటి ఇందు కు విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ విద్యార్థి కనిపించడం జరిగింది. తరువాత విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ సందర్శించిన సమయంలో…వేముల మాదేవి బైపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి స్కూల్ లోపటనే కడుపు నొప్పితో పడిపోవడం జరిగింది.
మళ్ళీ 20 నిమిషాల తర్వాత అంజలి అనే మరో విద్యార్థి కడుపునొప్పి ఫిక్స్ లతో పడిపోవడం జరిగింది అన్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అన్నారు. మంగళవారం రాత్రి దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎవరికి ఏం కాలేదు అన్నం తినకపోవడం వలన కడుపులో నొప్పి లేవడం జరిగింది అని తెలిపారు.
మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు గంటకు ఒకరు ఎందుకు కడుపు నొప్పితో కింద పడిపోవడం జరుగుతుంది అని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత ఆహారం అందిస్తున్న హాస్టల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కనీసం పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారం కూడా అందించడం లేదని వాపోయారు. హాస్టల్‌లో భోజనం, ఇతర సౌకర్యాలపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.
విద్యార్థుల కు ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని యాజమాన్యం సమాచారం అందించలేదని మండిపడ్డారు. తోటి విద్యార్థులు చెప్పడంతోనే మాకు తెలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తగిన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు హుటా హుటిన చేరుకున్నారు. పీఏపల్లి దుగ్యాల మోడల్ స్కూల్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ సీరియస్..
నల్గొండ జిల్లా పీఏ పల్లి దుగ్యాల మోడల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ పై దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు సీరియస్ అయ్యారు. స్కూలుకు సందర్శించిన ఎమ్మెల్యే బాలునాయక్ విద్యార్థులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది.. ఈ విషయంపై విచారణ జరిపి బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎవరు ఏం భయపడొద్దు అని విద్యార్థులకు ధైర్యం ఇచ్చినారు. విద్యార్థినుల ఆరోగ్యం వైద్యసేవలపై ఆరా తీసారు. అస్వస్థతకు గురైన విద్యార్థినిల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని కోరారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
విద్యార్ధి సంఘాల నాయకుల ధర్నా
నల్గొండ జిల్లా పీఏ పల్లి దుగ్యాల మోడల్ పాఠశాలలో హాస్టల్ విద్యార్థులు నవంబర్ 28 తేదీన నుంచి ఎస్ ఓ కు చెప్తున్న వినిపించకుండా ఉన్నారు అని విద్యార్థులు తెలిపారు. విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో.. అస్వస్థతకు గురైన అమ్మాయిలను దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేదుకు..
ఏఎన్ఎం పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్ పాఠశాల లోపలే సీక్రెట్‌గా వైద్యం అందించే ప్రయత్నం చేశారు. మొత్తానికి సమాచారం బయటకు రావడంతో.. హుటాహుటిన రెండు కార్లలో ఆటోలో దేవరకొండ ఏరియా ఆస్పత్రికి విద్యార్థులను తరలించి చికిత్స అందిస్తున్నారు.
MOST READ :
-
Miryalaguda : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే 7న యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం..!
-
TG News : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఇంటర్ అర్హతతోనే వీఆర్వో ఉద్యోగాలు..!
-
District collector : జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సరెండర్..!
-
District collector : మోడల్ స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కాదు.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!











